భారత్‌ - బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయి : మహమ్మద్‌ యూనస్

Telugu Lo Computer
0


బీబీసీ బంగ్లాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత్‌- బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాలు క్షీణించాయనే వాదనలను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్ త్రోసిపుచ్చారు. 'భారత్‌- బంగ్లాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయి. అయితే, ఇటీవల కొన్ని విభేదాలు తలెత్తాయి. అవి వచ్చి పోయే మేఘాల్లాంటివి. తప్పుడు సమాచారం, దుష్ప్రచారాలే ఈ సంఘర్షణలకు కారణం. వీటిని తొలగించేందుకు, ఇరుదేశాల మధ్య సహకారాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా అధికారులు నిరంతరం ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నారు' అని యూనస్‌ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)