దక్షిణాది రాష్ట్రాల్లోనే త్రిభాషా విధానం అమల్లో ఉంది. మరి ఉత్తరాది రాష్ట్రాల్లో త్రిభాషా విధానం అమలవుతుందా? అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. 'దక్షిణ భారతీయులు హిందీ నేర్చుకునేలా దక్షిణ భారత హిందీ ప్రచార సభ (విద్యా సంస్థలు) ఏర్పాటు చేసి ఒక శతాబ్దం గడిచింది. ఇన్ని సంవత్సరాలలో ఉత్తర భారతదేశంలో ఎన్ని ఉత్తర భారత తమిళ ప్రచార సభలు స్థాపించబడ్డాయి? నిజానికి ఉత్తర భారతీయులు తమిళం లేదా ఏదైనా దక్షిణ భారతీయ భాషను సంరక్షించడానికి నేర్చుకోవాలని మేము ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. మరి అలాంటిది మా మీద త్రిభాషా విధానంతో హిందీ భాషను ఎందుకు బలవంతంగా రుద్దుతున్నారు? హిందీని రుద్దడం ఆపమనే మేము కోరేది. బిజెపి పాలిత రాష్ట్రాలు మూడు భాషల్ని లేదా 30 భాషల్ని బోధించాలనుకుంటే వాటికి అనుమతించండి. కానీ తమిళనాడుని మాత్రం వదిలేయండి' అని స్టాలిన్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
ఉత్తరాదిలో త్రిభాషా విధానం అమలవుతుందా?
March 04, 2025
0
Tags