హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నేడు బీఆర్‌ఎస్ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంచార్జి వస్తే సమావేశం పెట్టారు. ఆ మీటింగ్‌లో సీఎం రేవంత్ మూడు ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పారు. మంచి మైకులో చెప్పాలని, చెడు చెవిలో చెప్పాలని ఆయన అన్నారు. మైక్‌లో చెప్పడానికి రేవంత్ రెడ్డి చేసిన మంచి ఏం లేదు. ఆయన చేసిన చెడు చెబితే చెవుల నుంచి రక్తం కారుతుంది. జనం కాంగ్రెస్‌ను.. రేవంత్‌ను తిట్టుకుంటున్నారు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నా బ్యాగులు మోయవద్దని అంటున్నారు. కానీ, ఆమె వాస్తవాలు తెలుసుకోవాలి. మీ పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డి బ్యాగులు మోసి ఇక్కడికి వచ్చారు. రేవంత్ రెడ్డికి టింగ్, టింగ్ అంటే నచ్చదు. అందుకే రేవంత్ రెడ్డి టకీ, టకీ మని పైసలు పడతాయని అన్నారు. మరి ఇప్పటి వరకు ఎవరికైనా టకీ, టకీమని పైసలు పడ్డాయా? పదిశాతం ఖర్చు పెడితే శ్రీశైలం జలాలు చేవెళ్లకు వచ్చేవి కానీ రేవంత్ రెడ్డికి ఇష్టం లేక చేయడం లేదు. కమీషన్లు రావనే ఉదేశ్యంతోనే పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేయడం లేదు. మూసీ వలన జరిగే లాభం ఎంత. కమీషన్ల కోసమే మూసీ అనే రంగుల సినిమా చూపుతున్నారు. మూసీతో 50-70 వేల కోట్లు కమీషన్లు తీసుకొని ఢిల్లీకి మూటలు పంపి సీఎం కుర్చీని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. నీళ్లు పాతాలానికి వెళ్లాయి నిధులు ఢిల్లీకి పోతున్నాయి. తెలంగాణ రైజింగ్ అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ, ఆ రైజింగ్ క్రైమ్ రేట్‌లో, అప్పుల్లో కనిపిస్తోంది. ఆత్మహత్యల్లో రైజింగ్, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల్లో రైజింగ్. గురుకుల పాఠశాలల విద్యార్థుల మరణాల్లో రైజింగ్. కేసీఆర్ అప్పులు తెచ్చి మరీ ఆస్తులు సృష్టించారు. మరి ఈ ఏడాదిలో లక్షా 50 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రేవంత్ ఏం సాధించారు? రేవంత్ రెడ్డి హైడ్రా పెట్టింది నా కోసమే. అధికారంలోకి వచ్చి 15 నెలల తర్వాత ఇంకా కేసీఆర్ ను తిట్టుకుంటా బ్రతుకుతావా? అన్ని చూసుకోకుండా ఆగం, ఆగంగా కమీషన్ల కోసం ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభించారు. ఎనిమిది మంది చిక్కుకుంటే సహాయక చర్యల పేరుతో మంత్రులు చాపల కూరలు తింటున్నారు అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
నీళ్లు పాతాలానికి వెళ్లాయి నిధులు ఢిల్లీకి పోతున్నాయి : కేటీఆర్
March 01, 2025
0
Tags