బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం : 37 మంది మృతి

Telugu Lo Computer
0


బొలీవియాలోని పోటోసి ప్రాంతంలో అతి వేగంతో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 37 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 39 మంది గాయపడ్డారని పోలీసులు, స్థానిక అధికారులు చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఉయుని – కొల్చాని మధ్య రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సులలో ఒకటి ఎదురుగా ఉన్న లేన్ లోకి దూసుకెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. గాయపడి వారిని సమీపంలోని చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదం నుండి బయటపడిన డ్రైవర్లలో ఒకరు ప్రమాదానికి ముందు మద్యం సేవించి ఉన్నాడని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రయాణికులు అతను మద్యం సేవించడాన్ని చూసినట్లుగా చెప్పారు. అక్కడ ఒక పెద్ద కార్నివాల్ వేడుక జరుగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)