ఈ ఏడాది మండే ఎండలు, వడగాల్పులు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది వేసవి చాలా తీవ్రంగా ఉండబోతోంది. వాస్తవానికి ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత పెరుగుతూ వస్తోంది. మార్చి నెలలో సాధారణం కంటే 4-5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదు కానుందని ఐఎండీ వెల్లడించింది. దీనికితోడు మార్చి 10వ తేదీ తరువాత వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. ఉదయం 9 గంటలకే సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉంటోంది. మద్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ నెల నుంచి వడగాల్పులు వీస్తాయనే హెచ్చరికల నేపధ్యంలో వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక ఏప్రిల్, మే నెలల్లో అయితే ఎండల తీవ్రత మరింత పెరగనుంది. కోస్తాంద్రలోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈసారి భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. ఓ వైపు ఎండల తీవ్రత, మరోవైపు ఉక్కపోత కారణంగా విపరీతమైన డీ హైడ్రేషన్ సమస్య ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సాధ్యమైనంతగా ఎక్కువ నీళ్లు తాగడం, ఎండలో వెళ్లకపోవడం అలవాటు చేసుకోవాలంటున్నారు. డీ హైడ్రేషన్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు. లేదా ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలి. మజ్జిగ, కొబ్బరికాయ నీళ్లు అధికంగా సేవించాలి. మార్చ్ 10వ తేదీ తరువాత రాష్ట్రంలో వడగాల్పుల ప్రభావం ఉంటుంది. మే నెలలో ఇది తీవ్రంగా ఉంటుంది. మే నెలలో అయితే ఉష్ణోగ్రత 45-47 డిగ్రీలు దాటిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)