ప్రముఖ ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ అయిన టాటా ప్రాజెక్ట్స్ రైట్స్ ఇష్యూలో టాటా సన్స్ రూ.1,432 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. టాటా ప్రాజెక్ట్స్ కూడా దాని వాటాదారుల నుంచి రూ.2,500 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 1979లో స్థాపించిన టాటా ప్రాజెక్ట్స్..భారత్‌లోని ప్రముఖ ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ నిర్మాణ సంస్థల్లో ఒకటి. దీనికి మూడు కీలక వ్యాపార విభాగాలు ఉన్నాయి - ఇంధనం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పట్టణ మౌలిక సదుపాయాలు, సేవల రంగం. టాటా సన్స్‌కు..టాటా ప్రాజెక్ట్స్‌లో 57 శాతం వాటా ఉంది. మిగిలిన వాటా టాటా పవర్, టాటా కెమికల్స్‌తో సహా ఇతర టాటా గ్రూప్ కంపెనీలకు ఉంది. భారత్‌లో అదిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారు అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి 2025 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో పొందబోయే డివిడెండ్ నుంచి కొద్ది మొత్తాన్ని టాటా సన్స్..టాటా ప్రాజెక్ట్స్‌లో పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో టాటా సన్స్..TCS నుంచి రూ.24,931 కోట్ల డివిడెండ్‌ను అందుకోనుంది. ఈ నిధులు టాటా క్యాపిటల్ రైట్స్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్‌కు, టాటా ఇంటర్నేషనల్‌లో పెట్టుబడులకు కూడా ఉపయోగపడనున్నాయి. ఐపీఓ ద్వారా $1.50 బిలియన్ల వరకు సేకరించాలనే లక్ష్యంతో గ్రూప్ తన ఆర్థిక సేవల విభాగం టాటా క్యాపిటల్‌ను సెప్టెంబర్ నాటికి లిస్ట్ చేయాలని యోచిస్తోంది.
టాటా ప్రాజెక్ట్స్ రైట్స్ ఇష్యూలో రూ.1,432 కోట్లు పెట్టుబడి పెట్టనున్న టాటా సన్స్ !
March 14, 2025
0
Tags