ఔషధాల దిగుమతులపైనా సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఏప్రిల్ 2న దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఇది చాలా దేశాల ఫార్మా కంపెనీలకు పెద్ద దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత దేశానికి. దీనికి కారణం అమెరికాకు మందులు ప్రధానంగా జనరిక్ ఔషధాలు ఎక్కువగా మన దేశం నుంచి ఎగుమతి అవుతుండటమే. ఇందులో ఏటా బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం జరుగుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఔషధాల ఎగుమతుల్లో అమెరికా వాటానే 31 శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. వీటిల్లో ప్రధానంగా సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, లుపిన్, అరబిందో ఫార్మా వంటివి ఉన్నాయి. ఇన్ని రోజులూ మందులపై అధిక సుంకాలు విధిస్తే వాటి రేట్లు పెరిగి అమెరికా ప్రజలే ఇబ్బందులు పడతారు కాబట్టి ట్రంప్ వాటికి వెళ్ళరు అనుకున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ ఆ హోప్ కాస్తా తీసి పారేశారు. ట్రంప్ ఈరోజు చేసిన ప్రకటన నిజమైతే కనుక మన దేశ ఫార్మీ విపరీతంగా దెబ్బతింటుంది. ఏటా భారత్ నుంచి మందుల ఎగుమతులు 30 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కవు అవుతాయి. దీంట్లో అధిక భాగం అమెరికాకే వెళతాయి. ఇండియా ఫార్మా కంపెనీలు అమెరికాకు ఎక్కువగా జెనరిక్ మందులు అమ్ముతున్నాయి. ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో అసలే నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు మరింత పీకల్లోతు నష్టాల్లోకి దిగజారాయి. ముఖ్యంగా ఫార్మా కంపెనీల షేర్లు అన్నీ పడిపోయాయి. దీంతో లక్షల కోట్లు ఆవిరి అయిపోయాయి. ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఫార్మా కంపెనీలకు ఇబ్బందులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికాలో ఔషధాల దిగుమతులపైనా సుంకాలు ?
February 20, 2025
0
Tags