ఏపీఎస్‌ఆర్టీసీలోని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు రూ.10 లక్ష ప్రమాద బీమా !

Telugu Lo Computer
0


పీఎస్‌ఆర్టీసీ ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ప్రమాద బీమా చేయనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికోసం ఒక్కొక్కరికి రూ.499 చొప్పున ప్రీమియం చెల్లించాలని అవికూడా ఆయా కాంట్రాక్టర్లు చెల్లిస్తారని తెలిపింది. ఏఎస్‌ఎస్‌వై కింద బీమా అమలు చేయనున్నామని యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ బీమా ఉద్యోగుల్లో ఎవరెవరికి వర్తిస్తుందో కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీలోని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ప్రభుత్వం ఈ బీమా సౌకర్యాన్ని కల్పించ నుంది. వారందరికి రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తింపజేస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో అద్దె బస్సుల డ్రైవర్లు, ఔట్‌ సోర్సింగ్‌ డ్రైవర్లు, ట్రాఫిక్‌ గైడ్లు, కౌంటర్లలో బస్‌ టికెట్లు బుక్‌చేసే సిబ్బంది, ఏసీ బస్సుల్లోని అటెండర్లు, బస్టాండ్లు, గ్యారేజ్‌లు, ఆర్టీసీ కార్యాలయాల్లో పనిచేసే స్వీపర్లు, ఇతర ఉద్యోగులు అందరికీ బీమా వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోస్టల్‌ శాఖ అంత్యోదయ శ్రామిక్‌ సురక్ష యోజన కింద ఈ బీమా అమలు చేయనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. దీనికి గాను ఒక్కొక్కరికి రూ.499 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ మొత్తాన్ని కూడా ఆయా ఉద్యోగులను నియమించుకున్న కాంట్రాక్టర్లు చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. ఈ మేరకు ఈడీ (ఆపరేషన్స్‌) అప్పలరాజు.. అన్ని జిల్లాల ప్రజా రవాణా శాఖ అధికారులు, జోనల్‌ ఈడీలకు ఆదేశాలు జారీచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)