గాజువాకలో ఆత్మహత్య చేసుకున్న యువకుడు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాకు చెందిన జి. భాస్కరరావు ఫార్మాసిటీలోని లాజరస్‌ ఫార్మా కంపెనీలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇంకా వివాహం కాలేదు. గాజువాక శ్రీనగర్‌లో శ్రీరాంనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కొద్ది రోజుల కిందట ఇంటి యజమానురాలి మనవరాలు ఊరు నుంచి వచ్చింది. పై ఇంట్లో ఇంటి యజమానురాలి బాత్‌రూమ్‌ కొంత ఓపెన్‌గా ఉంటుంది. శనివారం ఇంటి యజమానురాలి మనవరాలు స్నానం చేస్తుండగా భాస్కరరావు వీడియో తీస్తున్నాడని బిగ్గరగా అరిచింది. దీంతో భాస్కరరావు అక్కడ నుంచి తన రూమ్‌లోకి వచ్చేశాడు. దీంతో యువతి బంధువులు భాస్కరరావుపై దాడికి పాల్పడ్డారు. భాస్కరరావును ఆయన రూమ్‌లో బంధించి తాళం వేశారు. అతను చేసిన పనిని అతని తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో భయపడిపోయిన భాస్కరరావు తన రూమ్‌లోనే కేబుల్‌ వైర్లతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విజయనగరంలో ఆటోడ్రైవర్‌గా జీవిస్తున్న భాస్కరరావు తండ్రి తాతారావు తన కుమారుడిని యువతి బంధువులు కొట్టి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో యువతికి సంబంధించిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)