ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలో కోళ్లకు అంతుచిక్కని వ్యాధి సోకింది. దీంతో రోజు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి కోళ్ళు. ఆరోగ్యంగా కనిపించే కోళ్లు గంటల వ్యవధిలో మృత్యువాత పడుతున్నాయి. డిసెంబర్ లో మొదలైన ఈ వైరస్ జనవరి 13 తర్వాత విజృంభించింది. H15N వైరస్ లక్షణాలతో రోజు వేల కోళ్లు చనిపోతున్నాయి. శరవేగంగా వ్యాపిస్తున్న వైరస్ కారణంగా పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే 40 లక్షల కోళ్లు చనిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మేత తినడం, గుడ్డు పెట్టిన కొద్ది సేపటికి మృత్యు వాత పడుతున్నాయి. వ్యాక్సిన్ వేస్తున్నా ఉపయోగం లేకుండా వుందని అంటున్నారు. 2012, 2020లో ఇదే తరహాలో వైరస్ వ్యాపించింది. ఇప్పుడు గతం కంటే వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి కి కారణాలు తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు. టెస్టుల నిమిత్తం కోళ్ళ బ్లడ్ శాంపిల్స్ ను రైతులు భోపాల్ పంపుతున్నారు.
అంతు చిక్కని వ్యాధితో వేలాది కోళ్లు మృతి ?
February 02, 2025
0
Tags