యువకుడిగా మారడానికి ఏజ్-రివర్సింగ్ ఎక్స్‌పరిమెంట్స్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వ్యక్తి బ్రయాన్ జాన్సన్ (47). 'డోంట్ డై' అంటూ ఆయన చేసే ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే రీసెంట్‌గా బ్రయాన్, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ హోస్ట్ చేసే పాడ్‌కాస్ట్ కోసం ఇండియా వచ్చారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ పాడ్‌కాస్ట్ మధ్యలోనే ఆయన వెళ్లిపోవడం అందరికీ షాక్ ఇచ్చింది. దానికి కారణం మన దేశంలోని ప్రమాదకరమైన గాలి కాలుష్యమే. మాస్క్ పెట్టుకుని, ఎయిర్ ప్యూరిఫైయర్ వాడినా కూడా ఆయన అక్కడ ఉండలేకపోయారు. అమెరికా వెళ్లిన తర్వాత బ్రయాన్ జాన్సన్ అసలు విషయం బయటపెట్టారు. "నిఖిల్ కామత్ చాలా మంచి హోస్ట్. మా ఇద్దరి మధ్య కన్వర్జేషన్ చాలా బాగా జరిగింది. కానీ రూమ్ లోపలికి బయటి గాలి వస్తోంది. నేను పెట్టుకున్న ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా పనిచేయలేదు" అని ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు పాడ్‌కాస్ట్ రూమ్‌లోని గాలి నాణ్యత డేటాను కూడా షేర్ చేశారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 130 ఉందట. PM2.5 లెవెల్స్ 75 µg/m³ గా నమోదయ్యాయి. ఇండియాలో ఉండలేమని సంకేతం. ఇది రోజుకు 3.4 సిగరెట్లు తాగినంత ప్రమాదకరమని బ్రయాన్ జాన్సన్ చెప్పారు. ఇండియాలో మూడు రోజులు ఉన్న తర్వాత తన చర్మంపై దద్దుర్లు వచ్చాయని, కళ్లు, గొంతు కూడా మంటగా అనిపించాయని వివరించారు. ఇండియాలో గాలి కాలుష్యం చాలా సాధారణ విషయంగా తీసుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చారు. ఇంత ప్రమాదకరమైన కాలుష్యంలో కూడా మాస్కులు పెట్టుకోకపోవడం చూసి ఆయన షాకయ్యారు. ఇంతటి గాలి కాలుష్యాన్ని నేషనల్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని బ్రయాన్ జాన్సన్ డిమాండ్ చేస్తున్నారు. క్యాన్సర్‌కు మందు కనిపెట్టడం కంటే కూడా ఇండియాలో గాలి నాణ్యతను మెరుగుపరచడం వల్ల ప్రజారోగ్యానికి ఎక్కువ మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
మాస్క్ ఉన్నాఎయిర్ పొల్యూషన్ను తట్టుకోలేకపోయిన బ్రయాన్ జాన్సన్ !
February 04, 2025
0
Tags