అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) శాఖలో తాజాగా ఆరుగురు యంగ్ ఇంజనీర్లను నియమించుకున్నారు. ఇందులో భారత సంతతికి చెందిన యువకుడు కూడా ఉండడంతో అతడి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. డోజ్ శాఖను ట్రంప్ అమెరికా అనవసర ఖర్చులను తగ్గించడంతో పాటు గవర్నమెంట్ సిస్టమ్‌లో మార్పుల కోసం ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన బాధ్యతలను ఆయన టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు ఇచ్చారు. తాజాగా డోజ్ శాఖ 19-24 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఆరుగురు ఇంజనీర్లను నియమించుకుంది. వారిలో ఇప్పటికీ చదువును కొనసాగిస్తున్న వారు కూడా ఉన్నారు. యూఎస్ సర్కారుకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని కూడా తెలుసుకునేందుకు డోజ్‌కు అనుమతి ఉంటుంది. అటువంటి కీలక శాఖలో ఇంత తక్కువ వయసున్న వారికి ఉద్యోగులుగా తీసుకోవడంపై కొందరు పెదవి విరుస్తున్నారు. డోజ్ శాఖలో ఆకాశ్ బొబ్బ ఉండడంతో అతడు ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటన్న వివరాలను తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఆకాశ్ బొబ్బ 22 ఏళ్ల యంగ్ ఇంజనీర్. అతను యూసీ బర్కిలీలో మేనేజ్ మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ టెక్నాలజీలో విద్యనభ్యసించారు. అలాగే, హెడ్జ్ ఫండ్ బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్, మెటాలాంటి సంస్థల్లోనూ పనిచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, ఫైనాన్షియల్ మోడలింగ్ పద్ధతుల గురించి పూర్తి జ్ఞానాన్ని సంపాదించారు.
అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీలో ఆకాశ్ బొబ్బ నియామకం !
February 04, 2025
0
Tags