బడ్జెట్‌లో భూటాన్‌, మాల్దీవులకు పెరిగిన సాయం !

Telugu Lo Computer
0


కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈసారి విదేశాలకు అందించే సాయం కింద రూ.5.483 కోట్లు కేటాయింపులు జరిగాయి. గత ఏడాదితో పోల్చితే కాస్త తగ్గుదల కనిపించింది. కేంద్ర విదేశాంగ శాఖకు మొత్తం కేటాయింపులు రూ.20,516 కోట్లుగా ఉన్నాయి. ఇక ఈ సారి మాల్దీవులకు సాయం పెరగ్గా, భారత్‌ నుంచి ఎక్కువ లబ్ధి పొందుతున్న దేశంగా భూటాన్‌ నిలిచింది. భారత్‌ నుంచి ఎక్కువ మొత్తంలో విదేశీ సాయం పొందుతున్న దేశంగా భూటాన్‌ కొనసాగుతోంది. 2025-26 బడ్జెట్‌లో ఆ దేశానికి 2,150 కోట్ల కేటాయింపులు చేయగా  గత ఏడాదతో పోల్చితే మాత్రం కాస్త తక్కువే. అయినప్పటికీ.. భూటాన్‌ ప్రాథమిక అభివృద్ధి భాగస్వామిగా భారత్‌ ఉంది. అక్కడి మౌలిక సదుపాయాలు, జల విద్యుత్‌ ప్రాజెక్టులు తదితర రంగాల్లో భారత పెట్టుబడులు కొనసాగుతున్నాయి. మాల్దీవులకు ఆర్థిక సాయం రూ.470 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పెరిగింది. గతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోగా.. భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి మాలే ప్రయత్నిస్తున్న సమయంలో ఈ కేటాయింపులు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ కు సాయం రెట్టింపైంది. గత ఏడాది రూ.50 కోట్లు కేటాయించగా.. ఈసారి అది రూ.100 కోట్లకు పెరిగింది. మయన్మార్‌కు సాయం ఈసారి తగ్గింది. గత ఏడాది రూ.400 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.350 కోట్లకు సాయం తగ్గింది. నేపాల్‌కు రూ.700 కోట్లు, శ్రీలంకకు రూ.300 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.130 కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించారు. ఆఫ్రికా దేశాలకు సాయం రూ.225 కోట్లకు పెరిగింది. మంగోలియాకు అత్యల్పంగా రూ.5 కోట్లు కేటాయించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)