కేంద్రం అవసరమైన అంశాల్లో సహకారాన్ని అందించాలి : టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌

Telugu Lo Computer
0


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2025-26లో తెలంగాణకు ఇచ్చింది సున్నా అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌ అన్నారు. తెలుగు కోడలు అయి ఉండి కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు అవసరమైన అంశాల్లో సహకారాన్ని అందించాలని కోరారు. భాజపా తెలంగాణపై వివక్ష చూపిస్తోందని,  రాజకీయంగా రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తోందని ఆరోపించారు. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అక్కడ రాజకీయ లబ్ధి కోసం భాజపా కేంద్ర బడ్జెట్‌ను ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణకు ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ, భాజపా నాయకులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు.. కేంద్ర మంత్రులను, ప్రధాన మంత్రిని కలిసి తెలంగాణకు రావాల్సిన అనేక అంశాలపై విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)