యూఎస్ఎయిడ్ కింద వివిధ దేశాలకు అమెరికా ఇన్నాళ్లూ అందజేస్తూ వచ్చిన నిధులను డొనాల్డ్ ట్రంప్ నిలిపివేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పైనా ఆయన సంతకం పెట్టారు. యూఎస్ఎయిడ్ ఉద్యోగులనూ తొలగించారు. 15 నిమిషాల్లో ఖాళీ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఫలితంగా యూఎస్ఎయిడ్ ఉద్యోగులు తిరుగుముఖం పట్టారు. కార్యాలయాలను ఖాళీ చేశారు. ఈ తొలగింపు డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) సమర్థించుకుంది. తీవ్ర ఆర్థిక లోటును ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫండింగ్‌ను ఆపివేయాల్సి వచ్చిందనీ వివరించింది. మొత్తంగా 4,080 మంది యూఎస్ఎయిడ్ ఉద్యోగులు అమెరికా సహా వేర్వేరు దేశాల్లో వివిధ హోదాల్లో పని చేస్తోన్న విషయం తెలిసిందే. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరో 1,600 మంది వర్కర్లు ఇందులో విధులను నిర్వర్తిస్తూ వస్తోన్నారు. ఈ విభాగంలో పని చేస్తోన్న ఉద్యోగులందరినీ డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. తక్షణమే ఖాళీ చేయాలంటూ ఆదేశించారు. ఉద్యోగులు కార్యాలయాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్న సమయంలో పలువురు స్థానికులు వారికి వీడ్కోలు పలికారు. సొంబ్రె నెగ్రా గ్రూప్ సభ్యులు ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఇన్ని సంవత్సరాల పాటు నిస్వార్థంగా సేవలను అందించినందుకు చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికా నుంచి వెళ్లిపోతున్న యూఎస్ఎయిడ్ ఉద్యోగులు
February 28, 2025
0
Tags