ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసింది. ట్రేడింగ్ ప్రారంభమైన రెండున్నర గంటల్లోనే సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోయింది, అలాగే నిఫ్టీ 50 కూడా భారీగా క్షీణించింది. స్టాక్ మార్కెట్ ప్రారంభం నుంచే నష్టాల్లోకి వెళ్లింది. ముఖ్యంగా నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఈ పతనానికి ప్రధాన బాధితులుగా మారాయి. నిఫ్టీ 50 ఈరోజు 22,433 వద్ద ప్రారంభమై, 22,249 కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇది 1.20% పతనాన్ని చూపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 74,201 వద్ద ప్రారంభమై, 73,626 కనిష్ట స్థాయికి పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ 48,437 వద్ద ప్రారంభమై 48,161 కు చేరుకుంది. అన్ని ప్రధాన రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఐటీ, టెక్, ఆటో, టెలికాం స్టాక్స్ అత్యధిక నష్టాలను చవి చూశాయి.
రెండున్నర గంటల్లో 1000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
February 28, 2025
0
Tags