ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే దిశగా భద్రతాదళాలు భారీ విజయాన్ని సాధించాయని చెప్పారు. వచ్చే ఏడాది మార్చినాటికి నక్సలిజాన్ని పెకిలించివేస్తామని 'ఎక్స్' వేదికగా పునరుద్ఘాటించారు. ''ఛత్తీస్‌గఢ్‌లో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. అదేవిధంగా పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మానవత్వానికి వ్యతిరేకమైన నక్సలిజాన్ని అంతం చేసే ప్రయత్నంలో ఇద్దరు జవాన్లనూ కోల్పోయాం. ఈ అమరవీరులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామనే సంకల్పాన్ని కూడా పునరుద్ఘాటిస్తున్నాను. దేశంలోని ఏ పౌరుడూ దాని కారణంగా ప్రాణాలు కోల్పోకూడదు'' అని అమిత్ షా పేర్కొన్నారు. భద్రతాబలగాల ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ తెలిపారు.
వచ్చే మార్చినాటికి నక్సలిజాన్ని పెకిలించివేస్తాం : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
February 09, 2025
0
Tags