మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్త జనం !

Telugu Lo Computer
0


మేడారం సమ్మక్క సారల మినీ మేడం జాతర ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర చత్తీస్ గడ్ రాష్ట్రాల నుంచి భారీగా సందర్శకులు ముందస్తుగా దర్శనానికి తరలివస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొదట జంపన్న వాగులో పుణ్య స్థానాలు ఆచరించి, కళ్యాణ కట్ట లో తలనీలాలు సమర్పించి వనదేవతల దర్శనానికి గద్దెల వద్దకు చేరుకున్నారు. వీరికి దేవదాయశాఖ అధికారులు, పూజారులు దగ్గర ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా దర్శనాలు చేస్తున్నారు.  భక్తులు ఎలాంటి ఇబ్బందులు, తొక్కిసలాట కలగకుండా క్యూలైన్ల ద్వారా దర్శనాలను చేస్తున్నారు. క్యూలైన్లలో త్రాగునీటి సౌకర్యం కూడా కల్పించారు. క్యూలైన్లో దర్శనానికి వచ్చే భక్తులకు ఎండ దెబ్బ తగలకుండా పైన చలువ పందిళ్లు కూడా నిర్మించారు. దీంతో భక్తులు సాఫీగా క్యూలైన్ల ద్వారా ఎలాంటి ఒత్తిడి, తొక్కిసుందట లేకుండా ప్రశాంతంగా దర్శించుకుంటున్నారు. ఈ జాతరకు ముందస్తుగానే భక్తులు అధిక సంఖ్యలో వనదేవతలను దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ ఆదేశాల మేరకు డిఎస్పి రవీందర్, పస్రా సిఐ గద్ద రవీందర్, స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి లు ఆదివారం భారీ బందోబస్తు నిర్వహించారు. భారీగా తరలివస్తున్న ప్రైవేటు వాహనాలతో ట్రాఫిక్ జామ్ కాకుండా, భక్తులకు తొక్కిసలాట జరగకుండా, వాహనాలు పార్కింగ్ ప్రదేశాలలో పార్కింగ్ చేసే విధంగా దొంగతనాలు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)