కేంద్రం ఓపెన్ బ్లాక్ మెయిల్ కి దిగింది : తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్

Telugu Lo Computer
0


జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించినందుకు మోడీ ప్రభుత్వం తమ రాష్ట్రంపై 'ఓపెన్ బ్లాక్ మెయిల్', నిర్బంధం, రాజకీయ ప్రతీకారానికి దిగిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.2,152 కోట్లను లాక్కొని ఇతర రాష్ట్రాలకు పంచిపెట్టిందని ఆదివారం  'ఎక్స్'లో పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానం -2020, మూడు భాషల పాలసీని తమిళనాడు వ్యతిరేకించడంతో కేంద్రం బహిరంగ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతోందని అన్నారు. తమిళనాడుపై బిజెపి అన్యాయానికి హద్దులు లేకుండా పోయాయని దుయ్యబట్టారు. విద్యార్థులకు కేటాయించిన రూ.2,152 కోట్లు లాక్కొని, ఇతర రాష్ట్రాలకు పంచి పెట్టిందని అన్నారు. ఇది నిర్బంధం కాక మరోకటి కాదని, విద్యార్థుల హక్కులకు మద్దతుగా పోరాడినందుకు వారిని శిక్షించడం తగదని అన్నారు. ఒక రాష్ట్రంపై రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు భారత దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇంత నిర్దాక్షిణ్యంగా విద్యార్థుల గొంతు నొక్కలేదని అన్నారు. తమిళనాడు, ఆ రాష్ట్ర ప్రజల పట్ల విద్వేషం ఉందని ఈ చర్యతో బిజెపి మరోసారి నిరూపించుకుందని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)