జీఎస్ఎమ్ఏ బోర్డు యాక్టింగ్ చైర్‌పర్సన్‌గా గోపాల్ విఠల్ !

Telugu Lo Computer
0


జీఎస్ఎమ్ఏ బోర్డు యాక్టింగ్ చైర్‌పర్సన్‌గా ఎయిర్‌టెల్‌ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విఠల్ నియమితులయ్యారు.ఆయన ఇప్పటివరకు జీఎస్ఎమ్ఏలో డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు ఉన్న చైర్మన్, సీఈవో హోసే మారియా అల్వారెజ్ పల్లటే తన పదవికి రాజీనామా చేయడంతో గోపాల్‌ను జీఎస్ఎమ్ఏ యాక్టింగ్‌ చైర్‌పర్సన్‌గా నియమించారు. గోపాల్ విఠల్ ఈ మధ్యే జీఎస్ఎమ్ఏ బోర్డు వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన 2019-20 కాలంలో బోర్డుకు కీలక సభ్యుడిగా సేవలందించాడు. జీఎస్ఎంఎ ప్రపంచ టెలికాం పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 1100 పైగా సంస్థలు ఉన్నాయి. వీటిలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్, హ్యాండ్‌సెట్, పరికర తయారీదారులు, సాఫ్ట్‌వేర్ సంస్థలు, పరికర సరఫరాదారులు, ఇంటర్నెట్ సంస్థలు, సంబంధించిన కంపెనీలు ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)