విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ భేటీ ముగిసింది. 2014లో రాష్ట్ర విభజన జరిగినా కొన్ని ముఖ్యమైన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. దాదాపు రెండేళ్ల తర్వాత విభజన చట్టం అమలుపై హోంశాఖ లోతుగా సమీక్షించింది. సమన్వయంతో ఇరు రాష్ట్రాలు సమస్యలు పరిష్కరించుకోవాలని హోంశాఖ సూచించింది. రెండు రాష్ట్రాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులకు మద్దతు ఉంటుందని తెలిపింది. నిధుల పంపకాల్లో సమస్యలపై సానుకూల దృక్పథంతో ఉండాలని హోంశాఖ సూచించింది. తమకే ఎక్కువ కావాలని పట్టుబడితే ఇద్దరికీ నష్టం వస్తుందని చెప్పినట్టు సమాచారం. 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల విషయంలో న్యాయ సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు. తదుపరి భేటీలో ఒక నిర్ణయం తీసుకుందామని హోంశాఖ కార్యదర్శి చెప్పినట్టు తెలిసింది.
విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలి : కేంద్ర హోంశాఖ
February 03, 2025
0
Tags