ముగిసిన ఢిల్లీ ఎన్నికల ప్రచారం !

Telugu Lo Computer
0


ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సాయంత్రం 5గంటలకు తెర పడింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరగనుండగా, 8వ తేదీన వారి భవితవ్యం తేలనుంది. పోలింగ్‌కు ముందు రెండు రోజులు కీలకం కావడంతో అప్రమత్తమైన ఎన్నికల సంఘం ప్రలోభాలను అరికట్టేందుకు నిఘా పెంచింది. చివరి రోజున రాజకీయ పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. అధికారం కాపాడుకునేందుకు అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ అనేక హామీలతో ప్రజల్లోకి వెళ్లింది. రెండు దశాబ్దాలకు పైగా అధికారానికి దూరమైన భాజపా చివరి రోజు 22 రోడ్‌ షోలు నిర్వహించింది. ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. 2013కు ముందు పదిహేనేళ్లు పాలించిన కాంగ్రెస్‌.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. మరోవైపు ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)