మేడ్చల్ లో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య !

Telugu Lo Computer
0


హైదరాబాద్ శివారు మేడ్చల్ లో నేడు పట్టపగలే దుండగులు నడిరోడ్డుపై ఓ యువకుడిని హత్య చేశారు. అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి చంపారు. హత్య అనంతరం ఇద్దరు దుండగులు అక్కడ్నించి పరారయ్యారు. హత్యకు గురైన యువకుడిని ఉమేశ్ (25) గా గుర్తించారు. కుటుంబ వివాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యానికి బానిసైన సొంత తమ్ముడే హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఉమేశ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)