తెలంగాణ అసెంబ్లీ వాయిదా వేయడంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏమిటని ఎక్స్ వేదికగా నిలదీశారు. కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్ట్, నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదమని విమర్శించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదు, ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు? కాంగ్రెస్ పార్టీని ట్యాగ్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
అసెంబ్లీ వాయిదా వేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం !
February 04, 2025
0
Tags