టెక్సాస్‌ నుంచి భారత్ కు 205 మందితో వలసదారుల విమానం పయనం

Telugu Lo Computer
0


మెరికాకు అక్రమంగా వలస వెళ్లిన భారతీయులలో 205 మందిని విమానంలో వెనక్కి తరలిస్తున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సీ-17 యూఎస్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ వీరిని తరలిస్తోంది. భారత్‌కు చేరుకోవడానికి 24 గంటలు పడుతుందని అంచనా. అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాలపై ఇప్పటికే భారత్‌ తన స్పందనను తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. త్వరలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ తరుణంలో అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల తొలివిడత తరలింపు జరుగుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)