వ్యవసాయంలో ఉత్పాదకతను పెంపొందించుకోవడంలో కృత్రిమ మేధ

Telugu Lo Computer
0

హారాష్ట్రలో బారామతి రైతులు ఏఐను ఉపయోగించుకొని, మంచి దిగుబడులు సాధించిన వీడియోను మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల షేర్ చేశారు. ''వ్యవసాయ రంగంలో కూడా ఏఐ అద్భుతమైన ప్రభావం చూపిస్తోందని చెప్పేందుకు అద్భుతమైన ఉదాహరణ ఇదే'' అని ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చారు. ఏఐ అన్నింటిని మెరుగుపరుస్తుందని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ దీనిపై కామెంట్ చేశారు. రైతులు తమ వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని, ఉత్పాదకతను పెంపొందించుకోవడంలో కృత్రిమ మేధ ఎలా ఉపయోగపడుతుందో ఆ వీడియోలో వివరించారు. ఈ సందర్భంగా బారామతికి చెందిన ఒక రైతు సాధించిన విజయాలను ప్రస్తావించారు. పంట దిగుబడిలో గణనీయమైన మార్పు వచ్చిందని, రసాయనాల వినియోగం తగ్గించడం, తక్కువ నీటిని సమర్థవంతంగా వాడటం వంటి ప్రయోజనాలను ఆ రైతు పొందినట్లు చెప్పారు. ఆ ప్రాంతానికి సంబంధించిన ఉష్ణోగ్రతలు, భూసార సమాచారాన్ని విశ్లేషించి, ఏఐతో సమ్మిళితం చేసి, స్థానిక భాషలోనే సమాచారాన్ని ఇవ్వడం ద్వారా రైతులకు మెరుగైన సమాచారం అందుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)