ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌ !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ లోని గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఆగంతకుల నుంచి ఈరోజు మరోసారి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఈ రోజు కాకపోతే రేపైనా నీ తల నరికేస్తామని ఆగంతకులు తనను బెదిరించినట్లు రాజాసింగ్‌ తెలిపారు. రెండు గుర్తు తెలియని ఫోన్‌ నంబర్ల నుంచి బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. గతంలోనూ రాజాసింగ్‌కు పాకిస్తాన్‌,ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై అప్పట్లో రాజాసింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. రాజాసింగ్‌కు హత్యకు కుట్రపన్నినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)