ముగిసిన అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి మూడు రోజులపాటు జరిపించడం జరిగింది. మూడు రోజులపాటు అనేక ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అంతేకాకుండా ఫ్రీ దర్శనంలో సుమారుగా లక్ష మంది ప్రజలు సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం చేసుకోవడం జరిగింది. రథసప్తమి రోజు ప్రత్యేక ప్రవేశ దర్శనం వంద రూపాయలు, విశిష్ట దర్శనం 300 రూపాయలు, కేరాభిషేకం 500 రూపాయలు టికెట్లు పెట్టి అరసవెల్లి దేవస్థానం వారు భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరిగింది. టికెట్లు రూపేణా 64,76,000/- రూపాయలు, ప్రసాదాలు అమ్మకం ద్వారా 5,62,000 రూపాయలు. మొత్తం 70,39,308/- రూపాయలు రావడం జరిగింది. ఇంకా హుండీ లెక్కింపు ద్వారా వచ్చే ఆదాయ వివరాలు ఇంకా తెలియరాలసి ఉంది ఆలయ ఈవో భద్రజీ తెలియజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)