మధ్యప్రదేశ్ లో శివపురి జిల్లాలో బహ్రెటాసాని గ్రామం సమీపంలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిరాజ్-2000 యుద్ధ విమానం కూలిపోయింది. ప్రమాదానికి ముందే ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన పైలట్లను తీసుకెళ్లేందుకు వైమానిక దళ హెలికాప్టర్ ప్రమాద స్థలికి చేరుకొని వారిద్దరిని గ్వాలియర్ కు తీసుకెళ్లింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. శిక్షణ విమానం కూలిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. రక్షణ అధికారుల ప్రకారం రెండు సీట్లు ఉండే మిరాజ్ 2000 సాధారణ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెబుతుందన్నారు. మిరాజ్-2000 యుద్ధ విమానం వివిధ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించింది. అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.
కూలిన మిరాజ్-2000 శిక్షణ యుద్ధ విమానం !
February 06, 2025
0
Tags