నా భార్య పుట్టింటికి ఇంటికి వెళ్ళింది - నేను సంతోషంగా ఉన్నాను !

Telugu Lo Computer
0


బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ తన భార్య పుట్టింటికి వెళ్లడంతో చాలా సంతోషంగా తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులకు బిస్కెట్లు పంపిణీ చేశాడు.  దీంతో పాటు తన సీటు వెనుక ప్రయాణికులకు కనిపించేలా ఓ కాగితాన్ని కూడా పెట్టాడు. అందులో “నా భార్య పుట్టింటికి ఇంటికి వెళ్ళింది. నేను సంతోషంగా ఉన్నాను" అని రాశాడు. ఓ ప్రయాణికుడు దీన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటో డ్రైవర్ పోస్ట్ పై జనాలు చాలా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ తాను కూడా కొన్ని రోజులుగా సంతోషంగా ఉన్నానని రాశాడు. "నువ్వు ఆటో డ్రైవర్ జీవితాన్ని నాశనం చేశావు. ఈ పేదవాడు ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని భార్యకు తెలిస్తే.. రోజూ ఆటోలోనే పడుకోవలసి వస్తుంది.” అని ఈ పోస్టును పంచుకున్న వ్యక్తిపై వినియోగదారు కామెంట్ చేశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)