అమెరికాలో తప్పిపోయిన మరో విమానం ?

Telugu Lo Computer
0


మెరికాలో మరో విమానం గల్లంతయింది. బేరింగ్‌ ఎయిర్‌ సంస్థకు చెందిన సెస్నా 208బీ గ్రాండ్‌ కారవాన్‌ అలస్కా మీదుగా ఉనాలక్‌లీట్ నుంచి నోమ్‌కు  వెళ్తుండగా తప్పిపోయినట్లు తెలుస్తోంది. విమానం మిస్సింగ్ సమయంలో అందులో ఒక పైలట్‌ సహా తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. నార్టోన్‌ సౌండ్‌ ఏరియాలో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఏటీసీతో విమానం కమ్యూనికేషన్ కోల్పోయిందని సమాచారం. విమానం రాడార్‎ వ్యవస్థతో సంబంధం కోల్పోవడంతో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. అదృశ్యమైన విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలస్కాలోని ప్రతికూల వాతావరణంగా కారణంగానే విమానం అదృశ్యమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)