సచివాలయాల సిబ్బందికి కొత్త విధులు ?

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్ లోని  గ్రామ, వార్డు సచివాల యాల్లో గుర్తించిన మిగులు సిబ్బంది లెక్కలను అధికారికంగా తేల్చారు. ఇప్పుడు వారి సేవల విని యోగం పైన తాజాగా నిర్ణయం తీసుకున్నారు. మిగులు సిబ్బందిని ప్రభుత్వ శాఖలకు కేటాయింపు పైన తొలుత ప్రతిపాదనలు వచ్చాయి. కాగా, ఇప్పుడు ప్రభుత్వం వీరికి కొత్త బాధ్యతలు అప్పగించే లా నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాల సేవల పైన కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులో లేకపోవటంతో సచివాలయ సిబ్బందితోనే ప్రతీ నెలా పెన్షన్లను పంపిణీ చేయిస్తోంది. ఇతర విధులను అప్పగిస్తోంది. ఇక, సచివాలయాల క్రమబద్దీకరణ లో భాగంగా ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ముందుగా సిబ్బంది సర్దుబాటు పైన అధికారులు జిల్లాల వారీగా వివరాలు సేకరించారు. సచివాలయాల్లో మిగులు సిబ్బంది గుర్తించారు. వీరిని క్షేతస్థాయిలో యాస్పిరేషనల్‌ ఫంక్షనరీస్‌ గా వినియోగించుకోవాల ని భావిస్తోంది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15,498 మందిని మిగులు ఉద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు తేల్చింది. గ్రామ సచివాలయాల్లో 12,126 మంది, వార్డు సచివాలయాల్లో 3,372మంది మిగులు ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. గ్రామ సచివాలయాల్లో మిగులు ఉద్యోగుల్లో అత్యధికంగా సర్వేయర్లు (గ్రేడ్‌- 3) 4,722మంది, గ్రామ మహిళా పోలీసులు 2,107 మంది, విఆర్‌ఓలు 2,899 మంది వార్డు ప్లానింగ్‌, రెగ్యులరేషన్‌ కార్యదర్శులు 1,336మంది ఉన్నారు. వార్డు సచివాలయాల్లో అత్యధికంగా వార్డు రెవెన్యూ కార్యదర్శులు 1,006మంది, వార్డు, ప్లానింగ్‌ రెగ్యులేషన్‌ కార్య దర్శులు 1,336 మంది మిగులు సిబ్బంది ఉన్నట్లు లెక్కలు తేల్చారు. ఇక, వీరిలో అర్హులను గుర్తించి వారికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న స్వర్ణాంధ్ర విజన్‌ -2047 కోసం విధుల్లో వినియోగించుకు నేలా వారికి కొత్త బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో విజన్‌ లక్ష్యాల అమలు తీరును పర్యవేక్షించడం, అందుకు అవసరమైన సూచన లు చేయడం వంటి విధుల ను అప్పగించనుంది. ప్రభుత్వ ఆదేశాలు మారుమూల గ్రామాల్లో సైతం అమలయ్యేలా మార్గదర్శకా లు సిద్ధం చేస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి వీరికి ఈ బాధ్యతలు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. మిగులు ఉద్యోగులుగా గుర్తించిన వారి విద్యార్హతల ఆధారంగా విధులు కేటాయించేలా ప్రణాళికా శాఖ సమాచారం సేకరిస్తోంది. ప్రభుత్వం ఈ కొత్త బాధ్యతల అప్పగింత పైన తుది కసరత్తు తరువాత అధికారికంగా నిర్ణయం వెల్లడించనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)