హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన పుల్లయ్య 20 ఏండ్లుగా మేస్త్రీగా పనిచేస్తూ నివాసం ఉన్నాడు. పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణ మేస్త్రీగా పరిచయాలు పెరిగాయి. ఆ పరిచయాలతోనే 15 ఏళ్లుగా బీకే గూడ, ఎస్ఆర్ నగర్ లో చిట్టీ ఫైనాన్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. అధిక వడ్డీ పేరు చెప్పి దాదాపు 300 మందితో చిట్టీలు, ఫైనాన్స్ నడిపినట్టు తెలిసింది. అలా దాదాపు రూ.70 కోట్లతో ఉడాయించినట్టు సమాచారం. బాధితుల నుంచి డబ్బుల కోసం ఒత్తిడి పెరగడంతో పుల్లయ్య ఈనెల చివరి వారంలో చెల్లిస్తానని చెప్పాడు. కానీ, 23వ తేదీనే ఓ క్యాబ్ లో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిపోయినట్టు సమాచారం. చాలామంది పెళ్లిళ్లు వ్యాపారం, విద్యా, వైద్య అవసరాలకు కోసం పుల్లయ్య ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా పుల్లయ్య ఉడాయించిన విషయం తెలుసుకొని బాధితులు గగ్గోలు పెడుతూ బీకేగూడలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. కాగా ఇంతవరకు తమకు ఈ విషయమై ఎటువంటి ఫిర్యాదూ అందలేదని ఎస్ఆర్ నగర్ పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్ లో రూ.70 కోట్లతో ఉడాయించిన చిట్టీల వ్యాపారి ?
February 27, 2025
0
Tags