అలిపిరి మెట్ల మార్గంలో టీటీడీ ఆంక్షలు విధించింది. అలిపిరి మెట్ల మార్గంలో ఏడవ మైలు వద్ద ఇటీవల భక్తులకు చిరుత పులి కనిపించింది. దీంతో ఆ మార్గంలో భక్తుల భద్రత దృష్ట్యా రాకపోకలపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులను సాధారణంగా అనుమతిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 70 నుండి 100 మంది భక్తులతో గ్రూపుగా అనుమతిస్తోంద. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 12 ఏళ్లలోపు చిన్నారులకు అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది. రాత్రి 9.30 గంటలకు నడకదారిని టీటీడీ మూసివేస్తుంది.
అలిపిరి మెట్ల మార్గంలో ఆంక్షలు విధించిన టీటీడీ !
February 16, 2025
0
Tags