ఏపీ కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది : కేటీఆర్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కృష్ణా జలాలను తరలిస్తుంటే కాంగ్రెస్ చోద్యం చూస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కృష్ణా జలాల నుంచి ఏపీ ఇప్పటికే 646 టీఎంసీలు వినియోగించిందని, నదీ జలాలను ఏపీ తన్నుకుపోతుంటే కాంగ్రెస్ చలనం లేకుండా ఉందని అన్నారు. ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంట పొలాలను ఎండబెట్టిందని 'ఎక్స్' వేదికగా విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కోసం ఏర్పడ్డ రాష్ట్రంలో.. ఒక్కొక్కటిగా అన్నింటినీ కాంగ్రెస్ గంగలో కలుపుతోందన్నారు. కేఆర్ఎంబీ పరిధిలోని త్రీమెన్ కమిటీ దిక్కులేదు, సాగర్, శ్రీశైలంలో నీళ్లు అడుగంటి పొలాలు ఎండుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)