ప్రధాని నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ప్రధాని మోడీ పదవీకాలంతో సమానంగా లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ తెలిపింది. 1980 బ్యాచ్ విశ్రాంత ఐఏఎస్ అధికారి శక్తికాంతదాస్ 2018 డిసెంబరు నుంచి ఆరేళ్లపాటు ఆర్బీఐ గవర్నర్‌గా వ్యవహరించారు. అంతక్రితం రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల విభాగాల్లో కార్యదర్శిగా చేశారు. పదవీ విరమణ అనంతరం 15వ ఆర్థిక కమిషన్ సభ్యుడిగా, జీ20 షెర్పాగా వ్యవహరించారు. నాలుగు దశాబ్దాలకుపైగా పాలనపరంగా పలు విభాగాల్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలులోనూ శక్తికాంతదాస్ కీలక పాత్ర పోషించారు.
ప్రధాని మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ !
February 22, 2025
0
Tags