నాగార్జున సాగర్ డ్యామ్ అది కొద్ది దూరంలో మంటలు చెలరేగాయి. నాగార్జునసాగర్‌కు సమీపం ఉన్న గ్రామాలైనటువంటి నాగార్జునపేట తండా, జమ్మనకోట తండా, మూల తండ వరకు మంటలు వ్యాపించాయని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామాలకు దగ్గరలో హై టెన్షన్ వైర్లు ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి మంటలు చెలరేగలేవని, అగ్నిమాపక సిబ్బంది త్వరగా స్పందిస్తే మంటలు వ్యాపించలేదని గ్రామస్తులు తెలిపారు. పెద్ద పెద్ద భారీ వృక్షాలకు మంటలు వ్యాపించాయి. మంటలు మొత్తం గ్రామాల చుట్టుముట్టాయని అంటున్నారు. వ్యవసాయదారులు పొలాల దగ్గర పత్తి కట్టె తగలబెట్టే క్రమంలో అడవికి అంటుకుందని కొంతమంది చెబుతున్నారు. అప్పట్లో ఒక జలాశయము నిర్మించాలని ఆలోచన 1911లో బ్రిటిష్ పరిపాలకు వచ్చిందని తెలిపారు. చివరికి భారత దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా 1955 డిసెంబరు 10 నాడు పునాది రాయి పడిందని.. భారత దేశ మూడవ ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా 1967 లో కుడి, ఎడమ కాలవలోనికి నీటి విడుదల చేశారని పేర్కొన్నారు. అలాంటి ప్రాజెక్టు పక్కనే ఉన్నటువంటి ఫారెస్ట్‌లో మంటలు చెలరేగడంతో దాదాపు 100 ఎకరాల మేరకు విస్తరించాయి. ఫైర్ సిబ్బంది నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
నాగార్జునసాగర్ డ్యామ్ సమీపంలో అగ్ని ప్రమాదం !
February 22, 2025
0
Tags