భారతదేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు చాలా దేశాలతో పోల్చుకుంటే ఎక్కువగా ఉన్నాయి. అయితే అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పటికీ సామాన్యులకు అవి అందటం లేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధర బ్యారెల్ కు 75 డాలర్లను అధిగమించింది. గతంలో ఒకానొక సమయంలో ఇది 90 డాలర్ల వరకు ఉండేది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరల్లో మార్పులు వచ్చినప్పటికీ దేశీయంగా చమురు కంపెనీలు డీజిల్, పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రం మంచినీటి కంటే తక్కువ ధరకే ఇంధనాన్ని విక్రయిస్తున్నారు. ఇవి భారత్ కంటే చాలా తక్కువ రేటుకు తమ పౌరులకు విక్రయాలను కొనసాగిస్తున్నాయి. భారతదేశంలో పోర్ట్ బ్లెయిర్‌లో దేశంలోనే అత్యంత చౌకైన పెట్రోల్ లీటరుకు రూ.82.46కి, డీజిల్ రూ.78.05కి అమ్ముడవుతోంది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన పెట్రోల్ ఇరాన్‌లో విక్రయిస్తోంది. ఇక్కడ ఒక లీటరు పెట్రోల్ ధర రూ.2.48గా ఉంది. దీని తర్వాత హాంకాంగ్‌లో అత్యంత ఖరీదైన పెట్రోల్ లీటరుకు రూ.294.49 వద్ద విక్రయించటం గమనార్హం. అయితే ప్రపంచంలో పెట్రోల్ చౌకగా అమ్ముడవుతున్న రెండవ దేశం లిబియా. లిబియాలో ఒక లీటరు పెట్రోల్ ధర రూ.2.64గా ఉంది. ప్రంచవ్యాప్తంగా తక్కువ ధరలకు చమురును విక్రయిస్తున్న మూడవ దేశంగా వెనెజువెలా నిలిచింది. ఈ దేశంలో పెట్రోల్ ధర భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం లీటరుకు రూ.3కు సమీపంలో ఉంది. దీని తర్వాత పెట్రోల్-డీజిల్ తక్కువ ధరలకు విక్రయిస్తున్న దేశంగా అంగోలా నిలిచింది. అంగోలాలో లీటరు పెట్రోల్ ధర రూ.28.47గా ఉంది. ఇక తక్కువ ధరలకు పెట్రోల్ లీటరుపై రూ.29.25కి విక్రయిస్తున్న దేశంగా ఈజిప్ట్ నిలిచింది. అత్యంత చౌకైన పెట్రోల్ అమ్మే దేశాలలో అల్జీరియా ఆరో స్థానంలో ఉండగా ఇక్కడ లీటరుకు ధర రూ.29.45గా ఉంది. ఇదే సమయంలో మిడిల్ ఈస్ట్ దేశం అయిన కువైట్ లో పెట్రోల్ ధర రూ.29.50 ఉంది. ఇదే జాబితాలో 9వ స్థానంలో ఉన్న తుర్క్మెనిస్తాన్ రూ.37.26 వద్ద, ఈ జాబితాలో చివరిగా ఉన్న 10వ మలేషియాలో పెట్రోల్ ధర లీటరుకు రూ.39.80గా ఉంది. భారతదేశంలో ఇప్పటికే అనేక ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర లీటరుకు సెంచరీకి పైగానే ఉంది.
ఇరాన్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.2.48 !
February 18, 2025
0
Tags