అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధానికి చైనానుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయగా.. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌లపై 15 శాతం సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. చమురు, వ్యవసాయ పరికరాలపై ఆ టారిఫ్ 10 శాతం ఉంటుందని స్పష్టం చేసింది. టంగ్‌స్టన్ సంబంధిత పదార్థాల ఎగుమతులపై నియంత్రణ విధించింది. పీవీహెచ్ కార్పొరేషన్, ఇల్యుమినా ఇంక్ వంటి అమెరికా సంస్థలను విశ్వసనీయత లేనివాటి జాబితాలో చేర్చింది.
అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వాటిపై 15శాతం సుంకాన్ని విధించిన చైనా !
February 04, 2025
0
Tags