చెన్నై నగరంలో నడుపనున్న తొలి 'ఏసీ' సబర్బన్‌ రైలు ట్రయల్‌ రన్‌

Telugu Lo Computer
0


చెన్నై నగరంలో నడుపనున్న తొలి 'ఏసీ' సబర్బన్‌ రైలు ట్రయల్‌ రన్‌ మంగళవారం నిర్వహించారు. చెన్నై బీచ్‌-చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్‌ రైలు మార్గంలో 'ఏసీ' సబర్బన్‌ రైలు నడపాలని దక్షిణ రైల్వే 2019లో రైల్వే బోర్డుకు విజ్ఞప్తి చేసింది. దాని ప్రకారం, దక్షిణ రైల్వే చెన్నై డివిజన్‌కు రెండు ఏసీ సబర్బన్‌ రైళ్లు తయారుచేయాలని ఐసిఎఫ్‏కు రైల్వే బోర్డు ఆదేశించింది. ప్రస్తుతం ఏసీ సబర్బన్‌ రైలు తయారవడంతో, మంగళవారం ఐసిఎఫ్‌ ప్రాంగణంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. 12 బోగీలతో కూడిన ఈ రైలులోని భద్రతా అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ రైలును త్వరలో దక్షిణ చెన్నై డివిజన్‌ అధికారులకు అప్పగించనున్నారు. అనంతరం ఎక్స్‌ప్రెస్‌ రైలు మార్గంలో 110 కి.మీ వేగంతో ఈ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. మరో రెండు నెలల్లో ఏసీ సబర్బన్‌ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)