యూన్ కేసు ప్రాసిక్యూటర్ కార్యాలయానికి బదిలీ

Telugu Lo Computer
0


భిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ పై నేరారోపణ కోసం ఈ కేసును ప్రాసిక్యూటర్ల కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్లు దక్షిణ కొరియా అవినీతి నిరోధక సంస్థ (సిఐఒ) గురువారం తెలిపింది. యూన్ పై అధికార దుర్వినియోగంతో పాటు ఇతరుల హక్కులను వినియోగించుకోకుండా అడ్డుకోవడం, తిరుగుబాటు అభియోగాలు మోపవలసిందిగా ప్రాసిక్యూటర్లను అభ్యర్థించనున్నట్లు సిఐఒకి చెందిన ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడు, వారి కుటుంబ సభ్యులతో సహా ఉన్నత స్థాయి అధికారులపై విచారణ చేపట్టడానికి 2021లో సిఐఒ ప్రారంభమైంది. ఈ అధికారులతో పాటు పోలీసులు, రక్షణమంత్రిత్వ శాఖతో కూడిన ఉమ్మడి బృందం విచారణ చేపడుతుంది. అయితే పరిమిత హక్కులు కలిగి ఉండటంతో సిఐఒ అధ్యక్షుడిని దర్యాప్తు చేసే అధికారం లేదు. దీంతో తదుపరి చర్య కోసం కేసును ప్రాసిక్యూటర్ల కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)