తిరుమలలో శారదా పీఠం చేపట్టిన భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. లేనిపక్షంలో కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. శారదా పీఠం తిరుమలలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతోందంటూ తిరుమల క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు తుమ్మా ఓంకార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శారదా పీఠం అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్నా కూడా.. టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ పిటిషనర్ తన పిటిషన్‌లో ఆరోపణలు చేశారు. ఈ పిటిషన్‌ను గతంలోనే విచారించిన ఏపీ హైకోర్టు భవన నిర్మాణాన్ని ఆపివేయాలని శారదా పీఠాన్ని ఆదేశించడం జరిగింది.
తిరుమలలో భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేయండి : శారదా పీఠానికి హైకోర్టు ఆదేశం !
January 23, 2025
0
Tags