భారత్ ఎన్నికలపై కామెంట్ చేసిన ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తరపున మెటా సంస్థ క్షమాపణలు చెప్పింది. కోవిడ్19 సమయంలో సరైన రీతిలో చర్యలు తీసుకోని ప్రభుత్వాలు కూలినట్లు జుకర్‌బర్గ్ ఇటీవల కామెంట్ చేశారు. అయితే ఆ దేశాల్లో భారత్ కూడా ఉన్నట్లు జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల మెటా సంస్థ ఈరోజు ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు మెటా ఇండియా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తూక్రల్ తన ఎక్స్ అకౌంట్‌లో జుకర్‌బర్గ్ తరపున క్షమాపణలు చెప్పారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు క్షమాపణలు కోరిన లేఖను కూడా ఆయన ట్యాగ్ చేశారు. కోవిడ్ తర్వాత అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ఓటమి చవిచూశాయన్న విషయం అనేక దేశాల్లో నిజమైందని, కానీ ఇండియా విషయలో అది నిజం కాలేదు. ఆ తప్పు పట్ల తాము క్షమాపణలు చెబుతున్నట్లు శివనాథ్ తూక్రల్ వెల్లడించారు. మెటా సంస్థకు ఇండియా చాలా కీలకమైన దేశమని ఆయన పేర్కొన్నారు. మరో వైపు 2024 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం ఓడిపోతుందని వ్యాఖ్యానించి మెటా సంస్థ ఛైర్మన్ వ్యాఖ్యానించినందుకు ఆ సంస్థకు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేయనున్నట్లు ఐటీ, కమ్యూనికేషన్స్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ నిశికాంత్ దూబే తెలిపారు.
భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ !
January 15, 2025
0
Tags