రెస్పాన్స్‌ఎబిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఏజీ నుంచి యూలర్‌ మోటార్స్‌కు రూ.170 కోట్ల రుణం !

Telugu Lo Computer
0


రెస్పాన్స్‌ఎబిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఏజీ నుంచి వాణిజ్య ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ యూలర్‌ మోటార్స్‌  20 మిలియన్‌ డాలర్ల (సుమారుగా రూ.170 కోట్ల) వరకు రుణాన్ని పొందినట్లు తెలిపింది. ఈ నిధులు యూలర్‌ మోటార్స్‌కు సంబంధించిన దేశీయ వాణిజ్య వాహన విభాగాన్ని విద్యుదీకరించే మిషన్‌ను వేగవంతం చేయడానికి సహాయపడతాయని సంస్థ తెలిపింది. ఇంకా ఈ నిధులను లాజిస్టిక్‌, ఇ-కామర్స్‌ క్లయింట్ల కోసం ఇటీవల ప్రారంభించిన నాలుగు చక్రాల స్టార్మ్‌ ఈవీ వృద్ధికి ఉపయోగిస్తామని కంపెని పేర్కొంది. అంతేకాకుండా యూలర్‌ మోటార్స్‌కు సంబంధించిన ఉత్పత్తి, పంపిణీ నెట్‌వర్క్‌లను పెంచడానికి; అలాగే పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని సంస్థ తెలిపింది. దేశీయంగా వాణిజ్య, లాజిస్టిక్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో యూలర్‌ మోటార్స్‌ మంచి స్థానంలో ఉంది. ఈ కొత్త ఫండింగ్‌ కంపెనీకి సంబంధించిన ప్రత్యేకమైన లాజిస్టిక్స్‌ అవసరాలను తీరుస్తుందని యూలర్‌ మోటార్స్‌ సీఈఓ సౌరవ్‌ కుమార్‌ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)