శ్రీవారి హుండీలో వంద గ్రాముల గోల్డ్ బిస్కెట్‌ను దొంగిలించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి !

Telugu Lo Computer
0


తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న పెంచలయ్య శ్రీవారి హుండీలో 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్‌ను దొంగిలించి, దాన్ని ట్రాలీలో దాచి పెట్టి తీసుకెళ్తుండగా విజిలెన్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. అతనిపై తిరుమల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దొంగిలించిన బంగార బిస్కెట్‌ను మూడో కంటకి తెలియకుండా ట్రాలీలో తీసుకెళ్తుండగా విజిలెన్స్ అధికారుల కళ్లలో పడ్డాడు. పెంచలయ్య దొంగిలించిన గోల్డ్ బిస్కెట్ 100 గ్రాములు బరువు ఉన్నట్లుగా విజిలెన్స్ అధికారులు తెలిపారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై తిరుమల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గతంలో కూడా ఇలాంటి చోరీలు ఏమైనా చేశాడా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)