డీమార్ట్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 4.8 శాతం వృద్ధితో రూ.723.54 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.690.41 కోట్లుగా ఉంది. అలాగే ప్రస్తుతం మూడవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 17.69 శాతం పెరిగి రూ.15,972.55 కోట్లుగా నమోదైంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఖర్చులు 18.52 శాతం పెరిగి రూ.15,001.64 కోట్లకు చేరుకున్నాయి. ఇదే కాలంలో మెుత్తం ఆదాయం 17.57 శాతం వృద్ధితో రూ.15,996.69 కోట్లుగా నమోదయ్యాయి. రిటైల్ స్టోర్ల వ్యాపారంలో అగ్రగామి ఆటగాళ్లలో ఒకరుగా ఉన్న డీమార్ట్ కంపెనీలో సీఈవో నెవిల్లే నోరోన్హా తాజాగా రాజీనామా చేశారు. కంపెనీతో దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ప్రస్తుతం రాజీనామా చేశాడు. జనవరి 2004లో కంపెనీలో చేరినప్పుడు డీమార్ట్ కేవలం 5 స్టోర్లను కలిగి ఉండగా.. ఆయన నేతృత్వంలో ప్రస్తుతం స్టోర్ల సంఖ్య 380కి చేరుకోవటం గమనార్హం. ప్రస్తుతం దమానీ కంపెనీకి మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్‌లలో స్టోర్లను నిర్వహిస్తోంది. 2026 జనవరిలో ప్రస్తుత సీఈవో నెవిల్లే నొరోన్హా టర్మ్ ముగియనుంది. నోరోన్హా నిష్క్రమణతో, ఫిబ్రవరి 1, 2026న థాయిలాండ్‌లోని యూనిలీవర్ దేశ అధిపతి, గ్రేటర్ ఆసియా, హోమ్ కేర్, జనరల్ మేనేజర్ అన్షుల్ అసవా ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది.
డీమార్ట్ సీఈవో నెవిల్లే నోరోన్హా రాజీనామా !
January 12, 2025
0
Tags