కెనడాలో ఓపెన్‌ వర్క్‌ పర్మిట్ల వీసా నిబంధనలు సడలింపు !

Telugu Lo Computer
0


కెనడాలోని అంతర్జాతీయ విద్యార్థులు/ఉద్యోగుల భాగస్వాములకు ఇచ్చే ఓపెన్‌ వర్క్‌ పర్మిట్ల వీసా నిబంధనలను అక్కడి ప్రభుత్వం సడలించింది. నిబంధనలకు లోబడి, అర్హులైన భాగస్వాములు 21 జనవరి 2025 నుంచి వర్క్‌ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కెనడా ఆర్థికవ్యవస్థ, కార్మిక శక్తికి ఊతమిచ్చేందుకు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది భారతీయులకు ప్రయోజనం కలగనున్నట్లు తెలుస్తోంది. తన పదవికి రాజీనామా చేయనున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రకటించిన కొన్ని రోజులకే ఈ ప్రకటన రావడం గమనార్హం. అర్హత కలిగిన అంతర్జాతీయ విద్యార్థులు, విదేశీ కార్మికుల భాగస్వాములు ఈ ఓపెన్‌ వర్క్‌ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 16 నెలలు అంతకంటే ఎక్కువ కాల పరిమితి ఉన్న మాస్టర్స్‌, పరిశోధక లేదా ఎంపిక చేసిన ప్రొఫెషనల్‌ కోర్సుల్లో నమోదు చేసుకున్న వాళ్ల కుటుంబీకులకే ఈ సడలింపు వర్తిస్తుంది. ఓడబ్ల్యూపీ కోసం దరఖాస్తు చేసుకునే సమయానికి ఉద్యోగి పని కాలపరిమితి కనీసం 16 నెలలు మిగిలి ఉండాలి. అయితే, విదేశీ కార్మికులపై ఆధారపడిన పిల్లలు  మాత్రం ఇందుకు అర్హులు కాదు. అయినప్పటికీ.. మునుపటి నిబంధనల ప్రకారం ఆమోదం పొందిన వారు మాత్రం రెన్యూవల్‌ చేసుకొని దానిని కొనసాగించవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)