కంభమేళాను స్పేస్ స్టేషన్ నుంచి ఫోటో తీసిన ఆస్ట్రోనాట్‌ !

Telugu Lo Computer
0


ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కంభమేళాలో పవిత్ర స్నానాలు చేసేందుకు కోట్లాది జనం వెళ్తున్నారు. ఆ త్రివేణి సంగమ ప్రదేశం ఇప్పుడు రాత్రిపూట దీపకాంతులతో వెలిగిపోతున్నది. ఆకాశం నుంచి అద్భుతంగా కనిపిస్తోంది. ఈ  సనాతన సంప్రదాయ సమ్మేళనాన్ని నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ తన కెమెరాలో బంధించారు. ఆస్ట్రోనాట్ డాన్ పెటిట్ కుంభమేళాకు చెందిన ఫోటోను రిలీజ్ చేశారు. రాత్రి పూట త్రివేణి సంగమ ప్రదేశం, లైట్ల వెలుతురులో ఓ నక్షత్ర కూటమిలా కనిపిస్తున్నది. ఆస్ట్రోఫోటోగ్రఫీకి పెటిట్ చాలా ఫేమస్. గంగానది ఒడ్డున జరుగుతున్న కుంభమేళా ఫోటో ఇదే అని, ప్రపంచంలో ఒకే చోట హాజరైన అతిపెద్ద మానవ సమాహారం అని ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడతను. గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో భ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఫోటోను తీశారు. హైపవర్డ్ కెమెరాల ద్వారా ఈ అద్భుతాన్ని బంధించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)