నీతి అయోగ్ నివేదిక పై సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగజారిందని, విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాల అమలకు మళ్లించలేమని వెల్లడించారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇవన్నీ చెబుతున్నట్టు వివరించారు. ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు ఇస్తామని తెలిపారు. అప్పులు చేస్తే చెల్లించే శక్తి ఏపీకి లేదని, వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని తెలిపారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకుంటే ప్రజలే బాధపడతారని పేర్కొన్నారు. రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. అయితే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అమలు : చంద్రబాబు నాయుడు
January 27, 2025
0
Tags