సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనం EVAను 'వేవ్ మొబిలిటీ'..ఈ రోజు లాంచ్ చేసింది. దీని ధర రూ.3.25 లక్షల నుంచి రూ.6 లక్షల (ఎక్స్-షోరూం) వరకు ఉంది. కంపెనీ 2026లో EVAకు సంబంధించి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాలని యోచిస్తోంది. వాహన డెలివరీలు 2026 రెండవ భాగంలో ప్రారంభమవుతాయని భావిస్తునట్లు వేవ్ మొబిలిటీ సీఈఓ విలాస్ దేశ్‌పాండే తెలిపారు. ప్రారంభంలో ఈ వాహనం పూణే, బెంగళూరు వంటి ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంటుందని, ఆ తర్వాత దశలవారీగా ఇతర ప్రధాన నగరాలకు విస్తరిస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ వాహన విభాగంలో నివా, స్టెల్లా, వేగా అనే మూడు వేరియంట్లు ఉన్నాయని, ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయినట్టు సంస్థ తెలిపింది.
వేవ్ మొబిలిటీ నుంచి సౌరశక్తితో నడిచే వాహనం విడుదల
January 18, 2025
0
Tags